• Neti Charithra

Breaking.. తుఫాను నష్టాలు తో రైలు కింద పడి కౌలు రైతు ఆత్మహత్య..!


Breaking.. తుఫాను నష్టాలు తో రైలు కింద పడి కౌలు రైతు ఆత్మహత్య..!



గుంటూరు: నేటి చరిత్ర


గుంటూరు జిల్లా లోఅప్పుల బాధ తాళలేక కౌలు రైతు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కాకుమాను మండలం పెద్దివారిపాలెంనకు చెందిన ముత్తవరపు శ్రీహరి 12 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇటీవల వచ్చిన నివర్‌ తుపాను కారణంగా రెండు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

దింతో సుమారు రూ.6 లక్షల నష్టం వచ్చింది. ఈ ఘటన తో మనోవేదనకు గురైన రైతు ఆవేదనకు గురై..అప్పుల బాధలు భరించలేకమనస్థాపానికి గురైన శ్రీహరి మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి పోయినట్లు అతని బంధువులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో

శ్రీహరి బాపట్లలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.