- Neti Charithra
Breaking.. తుఫాను నష్టాలను పరిశీలించిన సీఎం జగన్..ప్రతి రైతును ఆదుకోవాలని ఆదేశం..!
Breaking.. తుఫాను నష్టాలను పరిశీలించిన సీఎం జగన్..ప్రతి రైతును ఆదుకోవాలని ఆదేశం..!
తిరుపతి: నేటి చరిత్ర
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు , కడప, నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. పంటల నష్టాల నివేదికలను సిద్ధం చేయాలని సీఎం ఆయా జిల్లాల కలెక్టర్లు కు ఆదేశించారు.
రేణిగుంట విమానాశ్రయం లో ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం
ప్రతిఒక్క వరద బాధితుడిని మానవతాధృక్పథంతో చూడాలని అన్నారు. తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతిచెందారని వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు
సీఎం జగన్ వెంట మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి తో పాటు మూడు జిల్లాల కలెక్టర్ లు, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.