• Neti Charithra

Breaking.. తహసిల్దార్ కారులో నాటు సారా అక్రమ రవాణా.. పోలీసులు ఏం.. చేశారంటే..!


Breaking.. తహసిల్దార్ కారులో నాటు సారా అక్రమ రవాణా.. పోలీసులు ఏం.. చేశారంటే..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


అధికారుల సాక్షి గా..మండల మేజిస్ట్రేట్ వినియోగిస్తున్న కారు లో నాటు సారా రవాణా చేస్తున్న సమాచారం అందుకున్న

స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేసి పట్టుకోవడం సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి.

బొబ్బిలి ఎస్‌ఈబీ సీఐ విజయకుమార్‌ కథనంమేరకు.. ఓ తహసిల్దార్ అధికారిక

కార్యక్రమాలకు వినియోగిస్తున్న కారు లో పెద్దయెత్తున్న నాటుసారా తరలిస్తున్న సమాచారం అందుకున్న అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోబలిజిపేట మండలం పెదపెంకి వద్ద గురువారం అర్ధరాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఒడిశాలోని అలమండ దరి హడ్డుబండి నుంచి విజయనగరం జిల్లాలోని పెదపెంకి గ్రామానికి వెళ్తున్న ఒక కారును ఆపబోగా

వాహన డ్రైవర్ వేగంగా

ముందుకు దూసుకెళ్లిపోయాడు. పోలీసు సిబ్బంది కారును వెంబడించి సోదాలు చేయగా అందులో భారీగా

260 లీటర్ల నాటుసారా

పట్టుపడింది.

కారుపై తహసీల్దారు, మండల మేజిస్ట్రేఫట్‌, కొమరాడ బోర్డు ఉంది. సారా, కారును స్వాధీనం చేసుకుని విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన డ్రైవరు జానకి దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.