• Neti Charithra

Breaking.. తహసిల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ తో నలుగురు ఆత్మహత్యాయత్నం.. కురబలకోట లో కలకలం..!


Breaking.. తహసిల్దార్ కార్యాలయం ఎదుట

పెట్రోల్ తో నలుగురు ఆత్మహత్యాయత్నం.. కురబలకోట లో కలకలం..!



కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కురబలకోట తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం

ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కల కలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. ముట్ర వారిపల్లె కు చెందిన రైతు రమణ కు సర్వే నెంబర్ 1417/1 లో ఉన్న భూమి ని మరో వ్యక్తి అక్రమించాడు. దింతో తమ భూమిని సర్వే చేసి తమభూమి తమకు అప్పజెప్పాలని కొంత కాలం గా రెవిన్యూ

అధికారుల చుట్టూ తిరుగుతున్నా .. రెవిన్యూ అధికారులు స్పందించక పోవటంతో బాధిత కుటుంబం కురబలకోట తహసిల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిల్ తో నలుగురు సభ్యులు ఆత్మహత్త్యయత్నానికి పాల్పడటం తో టెన్షన్ నెలకొంది. దింతో వారం రోజుల్లో రైతు సమస్య పరిష్కరిస్తామని రెవిన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో రైతు కుటుంబం తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

650 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon