• Neti Charithra

Breaking..తనకు అన్యాయం జరుగుతోందంటూ..చిత్తూరు జిల్లాలో కన్నీరు.. పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే..!


Breaking..తనకు అన్యాయం జరుగుతోందంటూ..చిత్తూరు జిల్లాలో కన్నీరు.. పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


ఆమె అధికారపార్టీ ఎమ్మెల్యే.. ఏపీఐఐసి స్టేట్ చెర్మన్ చిత్తూరు జిల్లా కీలక ఎమ్మెల్యే లలో ఆమె కూడా ఒకరు అయిననగరి ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుపతిలో

సోమవారం కీలక ప్రివిలైజ్ కమిటీ సమావేశంలో ఆర్కే రోజా తన ఇబ్బందులను కమిటీ దృష్టికి తెచ్చారు. తనను అధికారులు

ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తనకు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని, కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకూ తన మాట వినడం లేదని రోజా చెప్పుకోచ్చారు. నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రొటోకాల్ విషయంలో తన పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరును రోజా కమిటీ ముందుంచారు. తనకు తెలియకుండానే అధికారులు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటి తో

ఆవేదన వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో కల కలం రేపింది. మండల స్థాయి నుంచి కలెక్టర్ వరకు.. చివరకు టీటీడీ అధికారులు సైతం కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు.