• Neti Charithra

Breaking..ఢిల్లీ లో ఆంధ్ర భవన్ వద్ద మెరుపు ధర్నా చేసిన ఏపీ కాంగ్రెస్ నేతలు .. !


Breaking..ఢిల్లీ లో ఆంధ్ర భవన్ వద్ద మెరుపు ధర్నా చేసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

.. !



ఢిల్లీ:నేటి చరిత్ర


విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటి కరించే నిర్ణయానికి వ్యతి రేకంగా ఏపీ కాంగ్రెస్ ఢిల్లీలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహింది. ఆంధ్ర భవన్ వద్ద చేపట్టిన కార్యక్రమం సందర్భంగా పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ఆధ్వర్యంలో ధర్నా

నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ కి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించి అడులోవాల్సి ఉందన్నారు. అవసరం అయితే ఐరన్ గనులను ప్రభుత్వాలే కేటాయించాలన్నారు. ఈ విషయం లో సీఎం జగన్ మోహన్ రెడ్డి అఖిలపక్షం నేతలతో ఢిల్లీ కెళ్లి ప్రధాన మంత్రిని కలవాలని సూచించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కార్మికులకు చివరి వరకు అండగా నిలుస్తామన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు, చిత్తూరు జిల్లా పీలేరు కు చెందిన పీసీసీ కార్యదర్శి అఘా మోహిద్దీన్ లు మాట్లాడుతూ వైసీపీ , బిజెపి పెద్దలు ఏపీ అభివృద్ది ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ తో పాటు ఏపీ కి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని అన్నారు. కార్యక్రమం లో పలు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్