• Neti Charithra

Breaking.. డ్రైవర్ ను..హత్య చేసి.. రైలు పట్టాలు పై..విసిరేసిన దుండగులు..చిత్తూరు జిల్లా లో దారుణం..


Breaking.. డ్రైవర్ ను..హత్య చేసి.. రైలు పట్టాలు పై..విసిరేసిన దుండగులు..చిత్తూరు జిల్లా లో దారుణం..!
కుప్పం: నేటి చరిత్ర


గుర్తు తెలియని వ్యక్తులు ..ఓ యువకున్ని దారుణ హత్య చేసి రైలు పట్టాలు పై పడేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.కుప్పం మండలం మంకలదొడ్డి గ్రామానికి చెందిన సంపత్ (47) బుధవారం

దారుణ హత్యకు గురయ్యాడు. సంపత్ ను హతమార్చిన దుండగులు మృతదేహాన్ని చెన్నై-బెంగళూరు రైల్వే మార్గంలోని ఆవులనత్తం గేట్ వద్ద రైల్వే ట్రాక్ పై పడేశారు.

( యువకున్ని హత్య చేసి రైలు పట్టాలపై విసిరేసిన దుండగులు)


సంపత్ డ్రైవరుగాపని చేస్తుండగా గత ఏడాది కాలంగా ఇంట్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంటినుండి వెళ్ళిన సంపత్ బుధవారం ఉదయం రైల్వే ట్రాక్ పై శవమై తేలాడు. కాగా మృతదేహం పడి ఉన్న సంఘటన స్థలానికి సమీపంలోని మామిడితోటలో సంపత్ కు సంబంధించిన చెప్పులు పడివుండగా, అతన్ని హతమార్చిన ఆనవాళ్లు ఉన్నాయి.మృత దేహం పై రైలు వెళ్ళటం తో శరీర భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. సంపత్ ను హత్య చేసి ట్రాక్ పై పడేసి ఉంటారని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కుప్పం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్