• Neti Charithra

Breaking.. డిప్యుటేషన్ రద్దు చేయలేదని.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళా ఎంపీడీఓ...!


Breaking.. డిప్యుటేషన్ రద్దు చేయలేదని.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళా ఎంపీడీఓ...!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


విధినిర్వహణలో తనకు ఇబ్బంది కరంగా బదిలీ చేసారని ఆవేదనతో ఓ మహిళా ఎంపీడీఓ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం నిజామాబాద్ జిల్లాలో కల కలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.జక్రాన్ పల్లి మండలంలో ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారతిని అధికారులు కొద్దిరోజుల క్రితం డిప్యూటేషన్ మీద అధికారులు

సిరికొండకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అయితే కుటుంబ సమస్యల కారణంగా తాను సిరికొండ వెళ్లలేనని, కొన్ని రోజుల వరకు డిప్యూటేషన్‌ను నిలిపివేయాలని ఆమె పలుమార్లు కోరారు. ఇందుకు అధికారులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం నిద్రమాత్రలు మింగారు.అపస్మారక స్థితి లో ఉన్న ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదు కు తరలించారు.