• Neti Charithra

Breaking.. డిగ్రీ విద్యార్థిని పట్ల.. పైశాచికం.. చేతులు, కాళ్ళు కట్టేసి.. పొలాల్లో..!


Breaking.. డిగ్రీ విద్యార్థిని పట్ల.. పైశాచికం.. చేతులు, కాళ్ళు కట్టేసి.. పొలాల్లో..!


విజయనగరం: నేటి చరిత్ర


డిగ్రీ చదువుతున్న విద్యార్థిని కి చేతులు..కాళ్ళు కట్టివేసి..న పైశాచిక ఘటన సోమవారం విజయనగరం జిల్లా లో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గుర్ల మండల సమీపంలోని ఓ పొలం వద్ద

యువతి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలిని తెర్లాం మండలం లోచర్ల గ్రామానికి చెందిన రమగా గుర్తించారు. అనంతరం కుటుంబ

సభ్యులకు సమాచారం అందజేశారు. రమ విజయనగరంలోని డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం రాత్రి ఆమె కాళ్లు, చేతులు క‌ట్టేసిన దుండ‌గులు వ‌దిలి వెళ్లిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితురాలు అక్కడికి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.