• Neti Charithra

Breaking.. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు.. చిత్తూరు జిల్లా లో 14 మంది స్మగ్లర్ లు అరెస్ట్..!


Breaking.. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు.. చిత్తూరు జిల్లా లో 14 మంది స్మగ్లర్ లు అరెస్ట్..!


తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తిరుపతి సమీపం లో ని

శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా 14 మంది స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు సిఐ వెంకట రవికి అందిన సమాచారం మేరకు breaking

ఆదివారం నుంచి పనపాకం నుంచి ఐతే పల్లి అటవీ ప్రాంతంలో ఆర్ ఎస్ ఐలు వాసు, సురేష్ డీఆర్వో నరసింహ రావు టీమ్ కూంబింగ్ చేపట్టినట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆయన టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ ఆదివారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టినట్లు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 14 మంది బ్యాగ్ లలో నిత్యావసర వస్తువులు పెట్టుకుని అడవుల్లోకి ప్రవేశించారు. అటవీ ప్రాంతంలో కి వచ్చిన తరువాత వారిని చుట్టుముట్టినట్లు తెలిపారు. వీరి నుంచి బియ్యం, బేకరీ వస్తువులు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు తమిళనాడు లోని తిరువన్నామలై జిల్లా జమునా మత్తూరు ప్రాంతంలోని జవ్వాది మలై కు చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. వారిని విచారిస్తున్నట్లు చెప్పారు. సిఐ సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారన్నారు. స్మగ్లర్ లను అడవుల్లోకి వెళ్లకుండా నియంత్రించడం వల్ల కొన్ని వందల ఎర్రచందనం చెట్లను కాపాడ గలిగామని అన్నారు. ఈ సమావేశంలో ఆర్ ఐ భాస్కర్, సిఐలు వెంకట రవి, చంద్రశేఖర్, ఆర్ ఐలు వాసు, సురేష్, లింగాధర్ తదితరులు పాల్గొన్నారు.