• Neti Charithra

Breaking.. ట్రాన్స్ కో డిఈ పాపం..పండింది.. రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ..పట్టుపడ్డ అధికారి..!







Breaking.. ట్రాన్స్ కో డిఈ పాపం..పండింది.. రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ..పట్టుపడ్డ అధికారి..!




నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)




అక్రమ అర్జనతో రైతుల రక్తం తాగుతున్న విద్యుత్ శాఖ కు చెందిన ఓ డిఈ పాపం పండిన ఘటన అనంతపురం జిల్లా లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

గుంతకల్లు ట్రాన్స్ కో డివిజనల్ ఇంజనీర్ రవిబాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల మంజూరు కోసం రైతుల నుంచి డీఈ రవిబాబు లక్షన్నర లంచం తీసుకున్నారు. ఇద్దరు రైతులు కలిసి లక్షన్నర లంచం ఇవ్వగా ఈ సొమ్ము లైన్ మెన్ ద్వారా డీఈకు చేరింది. కాగా రవిబాబు బాగోతాన్ని రైతులు రహస్యంగా సెల్ ఫోన్లో

చిత్రీకరించారు. అనంతరం దీనిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో డీఈ రవిబాబు దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా రైతులను వేధిస్తున్నట్లు డీఈ రవిబాబు పై కొంతకాలంగా ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఒక్కొ కొత్త ట్రాన్స్ ఫార్మర్‌కు 75000 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థ లోని కొందరు దళారుల సహకారంతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈయన అక్రమాలు వెలుగు చూడటం తో ఉన్నతాధికారులు డి ఈ రవి బాబు ను సోమవారం సస్పెండ్ చేశారు. కాగ ఈ యన కొత్త విద్యుత్ కనెక్షన్ లతో పాటు కింది స్థాయి ఉద్యోగుల తాత్కాలిక బదిలీ(ఇంచార్జ్) ల లోను..ప్రయివేటు కాంట్రాక్టర్ ల బిల్లుల మంజూరు లోను భారీగా చేతివాటం ప్రదర్శిస్తాడనే.. ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.


802 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon