- Neti Charithra
Breaking..ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి వాహనం ఢీ కొని యువకుడు మృతి..!
Breaking..ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి వాహనం ఢీ కొని యువకుడు మృతి..!
అనంతపురం:నేటి చరిత్ర
(మృతి చెందిన యువకుడు సాయి తేజ్)
అనంతపురం జిల్లా కుదురు మండల సమీపం లో ఓ పోలీస్ వాహనం ఢీ కొనడం తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.బళ్లారి జిల్లా శిరిగుప్ప తాలుకా సదాశివనగర్‌కు చెందిన బుచ్చిబాబు కుమారుడు తేజసాయి (24) గురువారం ఉద్యోగ పరీక్షకు హాజరవటానికి ద్విచక్రవాహనంపై అనంతపురం మీదుగా బెంగళూరుకు బయలుదేరాడు. దారిలో కూడేరు
మండలం అరవకూరు సమీపంలో ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో అనంతపురం నుంచి కూడేరు వస్తున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి వాహనం ఢీకొంది. దీంతో అతడు ఎగిరి కిందకుపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు క్షతగాత్రుడిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీస్ వాహన డ్రైవర్, గన్‌మెన్‌కు గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడికి తల్లి, తండ్రి, తమ్ముడు ఉన్నారు. పెద్ద కుమారుడు మృతి చెందడంతో కుటుంబం లో విషాదం నెలకొంది.