• Neti Charithra

Breaking.. ట్రాక్టర్ టైర్ పేలి.. గాలి లోకి ఎగిరి.. పడి.. ఇద్దరు మృతి..!


Breaking.. ట్రాక్టర్ టైర్ పేలి.. గాలి లోకి ఎగిరి.. పడి.. ఇద్దరు మృతి..!



శ్రీకాకుళం: నేటి చరిత్ర


ట్రాక్టర్ టైర్ పేలి.. ఇద్దరు మృతి చెందిన

విషాద ఘటన శ్రీకాకుళం లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు కథనం మేరకు..

జలుమూరు మండలం కొమనాపల్లి గ్రామంలో ఆదివారం కూడలి వద్ద ట్రాక్టరు టైరుకు గాలి పడుతుండగా

పేలిపోయింది. దీంతో దాసరి

సూర్యనారాయణ(52), బొమ్మాళి గోవింద(45) మృతి చెందారు. దాసరి సూర్యనారాయణ ముప్పై ఏళ్లుగా ఇక్కడ పాన్‌షాపుతోపాటు సైకిళ్లకు మరమ్మతు చేయడం, వాహనాలకు గాలి పట్టడం చేస్తుంటాడు.కొట్టడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఆదివారం రాత్రి దుకాణం మూసే సమయంలో తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవింద ట్రాక్టరు టైరు తీసుకువచ్చి మరమ్మతు చేయమని కోరారు. మరమ్మతు పూర్తి చేసి గాలి కొడుతున్న సమయంలో అది పేలిపోయింది. దాంతో వారిద్దరు గాలిలోకి ఎగిరిపడ్డారు. ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, తీవ్రగాయాల పాలైన గోవిందను 108 సహాయంతో శ్రీకాకుళం ప్రభుత్వ

ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.