• Neti Charithra

Breaking.. టీడీపీ శ్రేణుల ఆందోళన ..కుప్పం లో ఉద్రిక్తత..!


Breaking.. టీడీపీ శ్రేణుల ఆందోళన ..కుప్పం లో ఉద్రిక్తత..!



కుప్పం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి

నారా లోకేష్‌ జన్మదినం సందర్భంగా కుప్పం లో

టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అయితే టీడీపీ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతల వాగ్వాదం జరిగింది. అంతేకాదు పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. ర్యాలీలో డప్పులు, టపాసులకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. వైసీపీ ర్యాలీలకు అడ్డురాని నిబంధనలు టీడీపీ ర్యాలీకి ఎందుకు అడ్డువస్తున్నాయంటూ కార్యకర్తల ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుంది. దింతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగటం తో ఉద్రిక్తత నెలకొంది.