• Neti Charithra

Breaking.. టీడీపీ-వైసీపీ లకు చెందిన 120 మంది పై కేసులు నమోదు చేసిన ముదివేడు పోలీసులు..!


Breaking..

టీడీపీ-వైసీపీ లకు చెందిన 120 మంది పై కేసులు నమోదు చేసిన ముదివేడు పోలీసులు..!



కురబలకోట: నేటి చరిత్ర


(అంగళ్ళు లో ఉద్రిక్తత)

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్ళు సమీపంలో శుక్రవారం

అనుమతి లేకుండా జాతీయ రహదారి పై బైఠాయించి ధర్నా లు చేసిన ఘటన లో

120 మంది పై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ పార్టీకి చెందిన

నాయకులు టీడీపీ జాతీయ కార్యదర్శి

కిషోర్ కుమార్ రెడ్డి , రాజంపేట పార్లమెంట్

టీడీపీ ఇంచార్జ్ శ్రీ నివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ లతో పాటు 60 మందిపై అలాగే పోటీగా ధర్నా చేసిన వైసీపీ కు చెందిన మరో 60 మంది పై కేసులు నమోదు చేసి నట్లు మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు.