• Neti Charithra

Breaking.. టీడీపీ-వైసీపీ ఘర్షణ.. టీడీపీ వాహనాలు ధ్వంసం.. తంబల్లపల్లె నియోజకవర్గం లో ఉద్రిక్తత..!


Breaking.. టీడీపీ-వైసీపీ ఘర్షణ.. టీడీపీ వాహనాలు ధ్వంసం.. తంబల్లపల్లె నియోజకవర్గం లో ఉద్రిక్తత..!




కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తంబల్లపల్లె నియోజకవర్గం లో టీడీపీ కీలక నేతల పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో అంగళ్ళు సమీపం లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు చెందిన పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తంబల్లపల్లె నియోజకవర్గం లో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీనివాసులు రెడ్డి తో పాటు తంబల్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ లు భారీ కాన్వాయ్ తో వస్తుండగా అంగళ్ళు సమీపం చేనేత నగర్ వద్ద వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం తో పాటు గోబ్యాక్..గోబ్యాక్.. అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలకు ఘన స్వాగతం పలికేందుకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. దింతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి.

ఈ సందర్భంగా టీడీపీ కాన్వాయ్ లోని పలు వాహనాలు ధ్వసం అయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.

ఈ ఘటన తో టీడీపీ నేతలు కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శంకర్ యాదవ్ లు రోడ్డు పై బైఠాయించారు. డిఎస్పీ రవిమనోహర చారి ఘటనా స్థలానికి చేరుకున్నారు.