• Neti Charithra

Breaking.. టీడీపీ కీలక నేతలు.. అరెస్ట్.. చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత..!


Breaking.. టీడీపీ కీలక నేతలు.. అరెస్ట్.. చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత..!




తిరుపతి: నేటి చరిత్ర

ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు నిరసన తెలిపేందుకు పూనుకోవడం తో చిత్తూరు జిల్లాలో పలు చోట్ల ఉద్రిక్తత చోటు

చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

బుధవారం రాత్రితిరుమల శ్రీవారికి ఎపి సిఎం జగన్‌ పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న

గరుడసేవను పురస్కరించుకుని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వామివారికి పట్టువ్రస్తాలను అందించనున్నారు. బుధవారం మధ్యాహ్నం వైఎస్‌ జగన్‌ రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో

తిరుపతి లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చెర్మన్ నర్సింహ యాదవ్, టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు, పలమనేరు లో

మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డిలతో పాటు పుంగనూరు నేతలు అనిషా రెడ్డి , శ్రీనాథ్ రెడ్డి,, సత్యవేడు లో టీడీపీ నేత రాజ శేఖర్,

లతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు నియోజక వర్గాల్లో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ లు చేయడం తో టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగారు.