• Neti Charithra

Breaking..టీడీపీ కీలక నేతను.. నరికి చంపిన ప్రత్యర్థులు..కడప జిల్లా లో దారుణం..!


Breaking..టీడీపీ కీలక నేతను.. నరికి చంపిన ప్రత్యర్థులు..కడప జిల్లా లో దారుణం..!



ప్రొద్దుటూరు: నేటి చరిత్ర


కడప జిల్లా లో ఓ కీలక టీడీపీ నేత ను ప్రత్యర్థులు దారుణ హత్యకు పాల్పడ్డటం సంచలనం కలిగించింది.వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు సమీపం

సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలం వద్ద దుండగులు

మరణాయుధాలతో టీడీపీ జిల్లా నేత

సుబ్బయ్యను కిరాతకంగా నరికి చంపారు. సుబ్బయ్య హత్యకు గురి కావడం సంచలనం రేపుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుబ్బయ్య హత్యకు గురి కావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాగా, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిగా వ్యవహరించిన సుబ్బయ్య రాజకీయంగా విమర్శలు చేస్తూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. అనంతరం ప్రత్యర్థి పార్టీ శ్రేణులపై ప్రతి విమర్శలు చేశారు.