• Neti Charithra

Breaking..టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బైక్ ర్యాలీ.. !


Breaking..టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బైక్ ర్యాలీ.. !


హిందూ పురం: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం బైక్ ర్యాలీ చేశారు.

ఈ సందర్భంగాప్రభుత్వం రైతుల వెన్ను విరుస్తోందని బాలకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ.. గోళ్లపురంలో వర్షాలకు దెబ్బతిన్న కందిపంటను పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఆదుకోకపోతే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ స్థానికులతో కలిసి బైక్‌ ర్యాలీ చేపట్టారు. తుఫాను రైతులకు ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని అన్నారు.