• Neti Charithra

Breaking..టీడీపీ ఎమ్మెల్యే..కు చెందిన వందల కోట్ల ..ఆస్తుల వేలం..వేస్తున్న అధికారులు..!


Breaking..టీడీపీ ఎమ్మెల్యే..కు చెందిన

వందల కోట్ల ..ఆస్తుల వేలం..వేస్తున్న

అధికారులు..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇండియన్‌ బ్యాంక్‌ షాక్‌ ఇచ్చింది. గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్‌ బ్యాంక్‌ నిర్ణయించింది. ఈనెల 25న వేలం

నిర్వహించనుంది. ప్రత్యూష కంపెనీకి చెందిన తొమ్మిది ఆస్తులను బ్యాంక్ వేలం వేయనుంది.గతంలో ప్రత్యూష కంపెనీ రూ.248 కోట్ల మేర ఇండియన్‌ బ్యాంక్‌‌లో రుణం తీసుకుంది. 2006 అక్టోబర్‌ 4న రుణం చెల్లించాలంటూ మొదటి సారి బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఎలాంటి స్పందన లేకపోవడంతో 2017 ఫిబ్రవరి 21న ప్రత్యూష కంపెనీ కుదువ పెట్టిన ఆస్తులను ఇండియన్‌ బ్యాంక్‌ స్వాధీనం చేసుకుంది. కాగా గతంలో ప్రత్యూష కంపెనీకి డైరెక్టర్‌గా గంటా శ్రీనివాసరావు ఉన్నారు.  హైదరాబాద్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్ ఈ వేలం వేస్తున్నట్లు ప్రకటించింది.