- Neti Charithra
Breaking.. టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అరెస్ట్.. శ్రీకాకుళం జిల్లా లో ఉద్రిక్తత..!
Breaking.. టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అరెస్ట్.. శ్రీకాకుళం జిల్లా లో ఉద్రిక్తత..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
ఎపి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు
చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన స్వగృహంలో అచ్చెన్నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్కు తరలించారు. పంచాయతీ నామినేషన్ సమయంలో వైసిపి అభ్యర్థి అప్పన్న పై హత్యాయత్నం చేసినట్టు అచ్చెన్నాయుడి పై అభియోగం నమోదయింది. అచ్చెన్నాయుడితోపాటు మరో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 30 మందిపై కేసులు నమోదయ్యాయి. అచ్చెన్నాయుడి సోదరుడు హరి ప్రసాద్, కుమారుడు సురేష్ ల పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లా నలుమూలల నుండి టీడీపీ శ్రేణులు నిమ్మాడ కు భారీగా తరలివస్తున్నారు.
322 views0 comments