- Neti Charithra
Breaking.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి మరో మారు నోటీసులు పంపిన ప్రభుత్వం..!
Updated: Sep 28, 2020
Breaking.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి మరో మారు నోటీసులు పంపిన ప్రభుత్వం..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
(చంద్రబాబు ఇంటికి నోటీసులు అంటిస్తున్న రెవిన్యూ సిబ్బంది)
టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి రెవిన్యూ అధికారులు మరో మారు నోటీసులు పంపారు.కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా ఉండవల్లిలో టీడీపీఅధినేత చంద్రబాబు
నివాసముంటున్న ఇంటికి స్థానిక రెవెన్యూ అధికారులు నోటీసులు అతికించారు. ఎగువ నుంచి సుమారు 5లక్షల క్యూసెక్కులపై పైగా వరద వస్తుండటంతో కృష్ణా కరకట్టపై ఉన్న నివాసాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నివాసానికీ
నోటీసులు అతికించారు. వరదల తీవ్రత దృష్ట్యాఅప్రమత్తంగా ఉండాలని మాత్రమే నోటీసుల్లో అధికారులు సూచించారు. వరద ప్రవాహం దృష్ట్యా గతంలోనూ ఇదే తరహాలో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.