• Neti Charithra

Breaking..జేసీ దివాకర్ రెడ్డిఇంటిపై..వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దాడి.. తాడిపత్రి లో తీవ్ర ఉద్రిక్తత


Breaking..జేసీ దివాకర్ రెడ్డిఇంటిపై..వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దాడి.. తాడిపత్రి లో తీవ్ర ఉద్రిక్తత..!



అనంతపురం: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా లో వైసీపీ, టీడీపీ

నేతలు మధ్య తలెత్తిన వివాదం .. దాడులు..ప్రతి దాడులకు కారణం అయ్యాయి. దింతో ఉద్రిక్తత నెలకొంది.

వివరాలు ఇలా ఉన్నాయి.

తాడిప‌త్రి – ఎమ్మెల్యే పెద్దిరెడ్డి భార్య‌పై సోష‌ల్ మీడియాలో చేసిన పోస్టుల‌తో అనంతపురం రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్యకు వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వివాదం తీవ్రమైంది. తన భార్యకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారి జేసీ బ్రదర్స్ అనుచరులన్న అనుమానంతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి నాలుగు వాహనాలలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి తరలివచ్చారు. ఆయన వెళ్ళినపుడు జేసీ దివాకర్ రెడ్డి,

ప్రభాకర్ రెడ్డి తమ నివాసంలో లేరు. దాంతో ఇంట్లో వున్న జేసీ అనుచరులపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. అక్కడన్న దాసరి కిరణ్‌ అనే యువకుడిని కేతిరెడ్డి అనుచరులు చితకబాదారు. రెండు రోజుల్లో తాడిపత్రి విడచి వెళ్లకపోతే చంపుతామంటూ బెదిరించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. పోలీసులు కూడా జేసీ ఇంటికి చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులు మోహరించారు