• Neti Charithra

Breaking.. జిల్లా కలెక్టర్ పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు..!


Breaking.. జిల్లా కలెక్టర్ పై హత్య

కేసు నమోదు చేసిన పోలీసులు..!





నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తన వద్ద పనిచేస్తున్న పిఏ మృతి కేసులో

ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కలెక్టర్‌పై హత్య కేసు ను నమోదు చేసిన ఘటన సీజాతు చేసుకుంది. తన పిఏ దేబ్‌ నారాయణ పండా చనిపోయిన కేసులో మల్కాన్‌గిరి కలెక్టర్‌ మనీష్‌

అగర్వాల్‌తోపాటు మరో ముగ్గురిపై హత్యనేరం, సాక్ష్యాలను నాశనం చేశారనే నేరం కింద కేసులు నమోదు చేయాలని స్థానిక సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.

కలెక్టర్‌ పిఏ దేబ్‌ నారాయణ కనిపించడం లేదంటూ ఆయన కుటుంబసభ్యులు ఏడాది క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోయిన డిసెంబర్‌లో దేబ్‌ నారాయణ ఓ రిజర్వాయర్‌లో శవమై కనిపించారు. ప్రారంభంలో అంతా ఆయన ఆత్మహత్య చేసుకున్నారని భావించారు. కానీ ఆరు నెలల తర్వాత దేబ్‌ నారాయణ భార్య తన భర్తను కలెక్టర్‌, ఇతర సిబ్బంది కలిసి హత్య చేశారని ఆరోపించారు.

న్యాయం చేయాలంటూ ఆమె మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ డీజీపికి ఆదేశాలు అందాయి. దీంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో కలెక్టర్‌తోపాటు, ఇతర సిబ్బందిపై హత్యానేరం కేసు నమోదు చేశారు


826 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon