• Neti Charithra

Breaking.. జాతీయ స్థాయి పురస్కారం.. అందుకున్న మిట్స్ ప్రొఫెసర్ అరుల్ కుమార్..!


Breaking.. జాతీయ స్థాయి పురస్కారం.. అందుకున్న మిట్స్ ప్రొఫెసర్ అరుల్ కుమార్..!




కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లామదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, మదనపల్లి కళాశాల నందు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కే. అరుళ్ కుమార్ కు అరుదైన పురస్కారం లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. న్యూ ఢిల్లీ లోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) మరియు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ హార్డ్ వేర్ కంపెనీ వారు సంయుక్తముగా దేశ వ్యాప్తంగా

నిర్వహించిన "ఎంబెడెడ్ సిస్టం డిజైన్ యుసింగ్ MSP 430 MCU మూక్ (MOOC)" ఆన్లైన్ పరీక్ష నందు కళాశాల లోని విద్యార్థులు పాల్గొన్నారని, కేంద్ర ప్రభుత్వం, అకాడమిక్ మరియు ఇండస్ట్రీ మధ్య లింక్ ను ఏర్పరిచి, విద్యార్థులకు పరిశ్రమల ద్వారా హార్డ్వేర్ స్కిల్ డెవలప్మెంట్ ను పెంపొందిచినందుకు తన వంతు కృషి చేసిన డాక్టర్ కే. అరుళ్ కుమార్ కు ప్రశంస పత్రాన్ని న్యూ ఢిల్లీ లోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) వారు అందజేశారని ప్రిన్సిపాల్ అన్నారు. డాక్టర్ కే. అరుళ్ కుమార్ ను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ యువరాజ్, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.