• Neti Charithra

Breaking.. జాతీయ రహదారి పై బోల్తా పడ్డ కారు..ఇద్దరు మృతి..!


Breaking.. జాతీయ రహదారి పై బోల్తా పడ్డ కారు..ఇద్దరు మృతి..!కర్నూలు: నేటి చరిత్ర


వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తా పడ్డంతో ఇద్దరు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామం వద్ద 44 వ నెంబర్‌ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.

హైదరాబాద్‌ ఎస్సార్‌ నగర్‌ లోని షణ్ముఖ అగ్రిటెక్‌ కంపెనీ లో పని చేస్తున్న సుజిత్‌ కుమార్‌ తన స్నేహితుడు గోవర్ధన్‌ రెడ్డి తో కలిసి ఎపి 21 బి ఎక్స్‌ 0307 కారులో అనంతపురం వైపు వెళ్తున్నారు. రాత్రి ఒకటిన్నర సమయంలో కారు అదుపుతప్పి పెద్దటేకూరు గ్రామ సమీపంలోని రోడ్డు డివైడర్‌ ను దాటి ఎదురుగా వస్తున్న

ఎంహెచ్‌ 94బిఎల్‌ 6565 నెంబరు ఉన్న లారీని ఢకొీంది. అతివేగంగా వెళుతున్న కారు లారీ ముందు భాగంలో దూసుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సుజిత్‌ కుమార్‌, గోవర్ధన్‌ రెడ్డి లు అక్కడికక్కడే మరణించారు. లారీ బోల్తాపడింది.