• Neti Charithra

Breaking..జీతం..అడిగితే అసభ్యంగా మాట్లాడుతున్నారు..పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా టీచర్..!


Breaking..జీతం..అడిగితే అసభ్యంగా మాట్లాడుతున్నారు..పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా టీచర్..!
తిరుపతి: నేటి చరిత్రచిత్తూరు జిల్లా శ్రీ చైతన్య విద్యా సంస్థలో హెచ్ఓడి గా పనిచేస్తున్న రాణి అనే మహిళ గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదంటూ ఎంఆర్ పల్లి పోలీసుల ను గురువారం ఆశ్రయించింది. నాకు న్యాయం జరగకపోతే స్కూల్ ముందర ఆత్మహత్య చేసుకుంటాననీ స్కూల్ యాజమాన్యానికి

ఆమె హెచ్చరించిన ఘటన చోటు

చేసుకుంది. తనకుభర్త లేరు పిల్లల పోషణకై శ్రీ చైతన్య స్కూల్ మల్లంగుంట బ్రాంచ్ సోషల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గా పనిచేస్తున్న మహిళ తనకు అన్యాయం జరిగిందంటూ మీడియాను ఆశ్రయించింది.

అమలాపురం నుండి పిల్లల చదువుల కొరకు నెల జీతానికి శ్రీ చైతన్య మల్లంగుంట బ్రాంచ్లో లో 2019 నుంచి పని చేస్తున్నట్లు covid 19 రావడంతో సగం జీతం ఇచ్చారనీ జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలు తనకు జీతం ఇవ్వక పోవడంతో పలు ఇబ్బందులు పడ్డానని సెప్టెంబర్

నెలలో ఎమ్.ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగి నట్లు మహిళ తెలిపారు.కంప్లైంట్ ఇచ్చిన తర్వాత శ్రీ చైతన్య ఏజీఎం సురేష్, ప్రిన్సిపాల్ పవన్ మాట్లాడాలని పిలిపించి ఏజీఎం సురేష్ నన్ను అసభ్యకర పదజాలంతో మాట్లాడారని ఆన్లైన్ క్లాసులు కొరకు అమలాపురం నుంచి పిలిపించారని ఆన్లైన్ క్లాసుల ద్వారా పాఠాలు చెప్పి పిల్లల దగ్గర అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారూ కానీ, మాకు జీతాలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవు అంటున్నారని సమస్యలు చెప్పుకోవడానికి కూడా అయినవాళ్ళు దగ్గర లేని పరిస్థితి ఆటువంటి విపత్కరమైన పరిస్థితులలో కరోనా మహమ్మారి వైరస్ సోకడంతో పలు రకాల సమస్యలు ఇబ్బంది పడడం జరిగిందని చేతిలో డబ్బులు లేక ఇంటి అద్దె కట్టుకోలేక పిల్లల పోషణ బరువై డబ్బుల కోసం స్కూలు యాజమాన్యం వారిని అడిగితే వారు అసభ్యకర పదజాలంతో మాట్లాడారనీ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తగిన న్యాయం చేసి ప్రభుత్వ అధికారులు యాజమాన్యం మీద తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్