• Neti Charithra

Breaking... జనసేన అభ్యర్థికి గుండెపోటు.. కౌంటింగ్ కేంద్రం వద్దే మృతి..!


Breaking... జనసేన అభ్యర్థికి గుండెపోటు.. కౌంటింగ్ కేంద్రం వద్దే మృతి..!




విశాఖ:నేటి చరిత్ర


విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసిన 11 వ వార్డు జనసేన మహిళా అభ్యర్థి కౌంటింగ్‌ కేంద్రం వద్దనే గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఓట్ల కౌంటింగ్‌ సందర్భంగా.. కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకున్న జనసేన అభ్యర్థి బోను భారతి (55) గుండెపోటుతో మృతి చెందారు. విశాఖపట్నం మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు ఉదయం 8 గంటలనుంచే ప్రారంభమయ్యింది. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. విశాఖ ఫలితాలు మధ్యాహ్నం వరకు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.