• Neti Charithra

Breaking.. జడ్జి రామకృష్ణ ను అరెస్ట్ చేసిన పోలీసులు..!


Breaking.. జడ్జి రామకృష్ణ ను అరెస్ట్ చేసిన పోలీసులు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట కు చెందిన జడ్జి రామకృష్ణ ను మదనపల్లె టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

చిన్న‌‌మ్మ చ‌నిపోయిన త‌రువాత‌.. ఆమె చెక్కుల‌ను వ‌క్ర‌మార్గంలో ఐదుగురికి జారీ కేసులోబ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.

జ‌డ్జి రామ‌కృష్ణ చిన్న‌మ్మ సుచరిత‌ (65)కు పిల్ల‌లు లేక‌పోవ‌డంతో.. ఆయ‌న ఇంట్లోనే ఉండేది. జూన్ ‌6, 2019న ఆమె చ‌నిపోయింది. రామ‌కృష్ణ‌ పలువురికి ఇచ్చిన చెక్కుల‌పై చ‌నిపోయిన సుచరిత‌ సంత‌కం ఉంది.

దీంతో కెన‌రా బ్యాంకు మేనేజ‌ర్ కిర‌ణ్ కుమార్ ఆగ‌స్టు 6,2020న మ‌ద‌న‌ప‌ల్లి టూటౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఆమె చ‌నిపోయిన త‌రువాత చెక్కులు ఇష్యూ కావ‌డంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించాన‌ని.. బ్యాంకు మేనేజ‌ర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఫొరెన్సిక్ రిపోర్టు, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను డాక్యుమెంట‌రీ ఎవిడెన్స్‌గా పోలీసులు చూపించారు.

దీంతో రామ‌కృష్ణ‌ ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.