• Neti Charithra

Breaking.. జడ్జి తమ్ముడు రామచంద్ర పై..జరిగిన దాడి పై.. తీవ్రంగా స్పందించిన చిత్తూరు ఎస్పీ..!


Breaking.. జడ్జి తమ్ముడు రామచంద్ర

పై..జరిగిన దాడి పై.. తీవ్రంగా స్పందించిన చిత్తూరు ఎస్పీ..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో

సస్పెండ్ జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై జరిగిన దాడిలో రాజకీయ ప్రమేయం లేదని జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ పేర్కొన్నారు. మదనపల్లె వన్ టౌన్



(రామచంద్ర పై దాడి చేసిన వ్యక్తితో మాట్లాడిస్తున్న పోలీసులు)


( మీడియా సమావేశం లో మాట్లాడుతున్న ఎస్పీ సింథిల్ కుమార్)


పోలీసు స్టేషను నందు డిఎస్పీ రవిమనోహరచారి తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా రామచంద్రపై దాడికి పాల్పడిన ప్రతాప్ రెడ్డి ని 11 గం లలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నాం ,

అన్నారు.అక్కడ జరిగిన సంఘటనకు

ప్రత్యక్ష సాక్షి అయిన లాబ్ టెక్నిషియన్ రమణ తో పోలీసులు మాట్లాడించారు.

రోడ్డు పై తోపుడు బండి అడ్డంగా ఉందని వాహనం వెళ్ళాలి జరపాలని చెప్పిన జరపలేదు , అక్కడే ఉన్న రామచంద్ర జ్యోక్యం చేసుకొని వాదోపవాదాలు , అసభ్య పదజాలం తో దూషణలు , ఒకరిపై ఒకరు దొబ్బుకొని క్రింద పడ్డారు అని

ముద్దాయి , ప్రత్యక్ష సాక్షి రమణ తెలిపారు .

ఈ సందర్భంగా ఎస్పీ సింథిల్ కుమార్ మాట్లాడుతూ ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని, కేవలం దారి కోసం జరిగిన

ఘటన అని అన్నారు. ఈ దాడిలో

ఎలాంటి మారణ ఆయుధాలు వాడలేదని , ముద్దాయి ప్రతాప్ రెడ్డి తెదేపా ఫాలోయర్ అని , తెదేపా మాజీ శాసనసభ్యుడు శంకర్ తో ఉన్న ఫోటోలు ,వీడియో క్లిప్పింగ్ ద్వారా చూపించారు. ముద్దాయి తల్లి ఇటీవల ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసినది అని దాడికి పాల్పడిన వ్వక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్వకిగా నిర్దారణ అయిందని, ఇందులో ప్రదాన ప్రతిపక్షం అరోపిస్తున్నట్లు వైసిపి వారి ప్రమేయం లేదని వెల్లడించారు. దాడికి పాల్పడిన ముద్దాయిని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగిందని, అక్కడ వున్న ప్రత్యక్ష సాక్షులను విచారించి నిజనిజాలు తెలుసుకుని కేసు నమోదు చేయబడిందని వెల్లడించారు. ఈ సందర్భంగా దాడికి పాల్పడిన ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఇరుకు సందులో కారు వెళ్లడానికి దారి ఇవ్వకపోవడంతో గొడవ పడటం జరిగిందని, రామకృష్ణను గతంలో ఎప్పుడూ చూడలేదని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని వివరించారు. ప్రత్యక్ష సాక్షిగా వున్న రమణ మాట్లాడుతూ రామచంద్ర మద్యం మత్తులో వున్నారని, ఇరువురు తోపులాటలో కింద పడి గాయమైందని, ఎలాంటి ఆయుధాలు వాడలేదని వివరించారు.సమావేశం లో మదనపల్లె డిఎస్పీ రవిమనోహర చారి, సీఐ అశోక్ కుమార్, ఎస్ ఐ సునీల్ కుమార్ తదితరులు పేర్కొన్నారు. మీడియా సమావేశం అనంతరం మదనపల్లె డిఎస్పీ రవిమనోహర చారిబి కొత్తకోట లో దాడికి కారణం ఆయిన ప్రాంతాన్ని సోమవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు.




1,195 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon