• Neti Charithra

Breaking.. చెరువు లో స్నానానికి వెళ్లిన వ్యక్తి.. నీటి లో మునక.. !కురబలకోట లో విషాద ఛాయలు..!


Breaking.. చెరువు లో స్నానానికి వెళ్లిన వ్యక్తి.. నీటి లో మునక.. !కురబలకోట లో విషాద ఛాయలు..!



కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో

చెరువు లో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం విషాదాన్ని నింపింది.

స్థానికుల కథనం మేరకు..

మట్లివారిపల్లికి చెందిన సి. వెంకట్రమణ (35) ఆదివారం అయ్యప్ప మాల వేయ సంకల్పించాడు. ఇందుకు ముందుగా శనివారం సాయంత్రం ఊరికి దగ్గరలోని సీతారాం చెరువులోకి స్నానానికి వెళ్ళాడు. చెరువులో నీళ్ళు ఎక్కువ. ఈత వచ్చినా

(చెరువు లో స్నానానికి వెళ్లి అదృశ్యం అయిన

వెంకట రమణ) ఫైల్ ఫోటో


చెరువు మద్యలోకి వెళ్లడంతో గస ఎక్కు వైంది. తిరిగి వెనక్కి వచ్చే క్రమంలో ఊపిరి ఆడక నీట మునిగి పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇతన్ని బయటకు తీయడానికి గ్రామస్థులు విశ్వ ప్రయత్నం చేశారు. నీళ్ళు ఎక్కువ ఆపై లోతు వుండడంతో సాధ్యం కాలేదు. మరో వైపు చీకటి పడటంతో మృత దేహం కనిపించలేదు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఆదివారం ఉదయం మృత దేహం వెలికితీతకు చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.


341 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon