• Neti Charithra

Breaking.. చోరీ డబ్బుల పంపకాలలో విభేదాలు.. హత్యచేసి..సూట్ కేసులో తరలిస్తూ..పట్టుపడ్డ నిందితులు!


Breaking.. చోరీ డబ్బుల పంపకాలలో విభేదాలు.. హత్యచేసి..సూట్ కేసులో తరలిస్తూ..పట్టుపడ్డ నిందితులు!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


చోరీ చేసిన డబ్బుల పంపకాలలో తేడా రావడంతో మరో ఇద్దరు కలిసి

ఒకరిని హత్యచేసిన ఘటన తెలంగాణ లో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు..

రాజేంద్రనగర్‌లో సూట్‌కేసులో మృతదేహం లభించడం కలకలం రేపింది. ఇద్దరు జేబు దొంగలను పోలీసులు విచారిస్తుండగా... వారిద్దరూ తాము మరో దొంగ రషీద్‌ను హత్య చేసి సూట్‌కేసులో పెట్టి మృతదేహాన్ని పడేసినట్టు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా..సూట్‌కేసులో మృతదేహం లభ్యమైంది. హత్యకు గురైన రషీద్‌ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన జేబు దొంగగా పోలీసులు తెలిపారు. డబ్బు పంపకాలు, పాతకక్షలు హత్యకు కారణమా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.