• Neti Charithra

Breaking.. చంద్రబాబు పర్యటన కు నో చెప్పిన పోలీసులు .. చిత్తూరు జిల్లా లో ఉద్రిక్తత..!


Breaking.. చంద్రబాబు

పర్యటన కు నో చెప్పిన పోలీసులు .. చిత్తూరు జిల్లా లో ఉద్రిక్తత..!



తిరుపతి: నేటి చరిత్ర


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి నిరకరించగా జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టనున్న నిరసనకు పోలీసులు అనుమతించలేదు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు చెప్పారు.సోమవారం చంద్రబాబు

తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు నిరసనగా ఈ కార్యక్రమం టీడీపీ చేపట్టింది. దీనికి అనుమతి కోరుతూ టీడీపీ నేతలు పోలీసులకు లేఖ రాశారు. అయితే చంద్రబాబు నిరసనకు అనుమతించడం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. కాగ ముందస్తు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు నాని, ఎమ్మెల్సీ లు దొరబాబు, గాలి

సరస్వతమ్మ, గౌనివారి శ్రీనివాసులు తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం తో చిత్తూరు జిల్లా లో ఉద్రిక్తత నెలకొంది.