• Neti Charithra

Breaking..చింతామణి ఎమ్మెల్యే కృష్ణా రెడ్డి కి బి కొత్తకోట లో ఘన స్వాగతం పలికిన స్థానికులు..!


Breaking..చింతామణి ఎమ్మెల్యే కృష్ణా రెడ్డి కి బి కొత్తకోట లో ఘన స్వాగతం పలికిన స్థానికులు..!


బి కొత్తకోట: నేటి చరిత్ర

కర్ణాటక రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ చింతామణి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో పలువురు ఘన స్వాగతం పలికారు. బి కొత్తకోట లో జరిగిన

ఓ ప్రయివేటు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన సన్నిహితుడైన తంబల్లపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఎం ఎన్ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి విచ్చేయడంతో ఎమ్మెల్యే కృష్ణా రెడ్డి కి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కృష్ణా రెడ్డి

మీడియా తో మాట్లాడుతూ బి కొత్తకోట- చింతామణి మార్గం లో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రజా రవాణా సౌకర్యర్థం కర్ణాటక ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంపుకు చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక లో జేడీఎస్ ప్రభుత్వం లో అన్ని ప్రాంతాల అభివృద్ధి కి కృషి చేశామని ఆయన చెప్పుకొచ్చారు. సమావేశం లో కాంగ్రెస్ నాయకులు ఎం ఎన్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సుబ్రమణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.