- Neti Charithra
Breaking... చిత్తూరు లక్జరీ.. ఆర్టీసీ బస్సు బోల్తా.. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలింపు..!
Breaking... చిత్తూరు లక్జరీ..
ఆర్టీసీ బస్సు బోల్తా.. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలింపు..!
కర్నూలు: నేటి చరిత్ర
చిత్తూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ
ఆర్టీసీబస్సు బుధవారం వేకువ జామున కర్నూలు సమీపం లో బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రికర్నూలుకు బయలుదేరింది. తెల్లవారుజామున కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని తమ్మరాజుపల్లె గ్రామ
సమీపంలో అదుపుతప్పి డివైడర్ను దాటి రహదారి అవతల ఉన్న కల్వర్డును ఢీకొట్టి గుంతలో పడింది. బస్సు పూర్తిగా తిరిగి పడటంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. పాణ్యం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను బయటకు తీశారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. ప్రమాదంలో
గాయపడిన వారిలోచిత్తూరుకు చెందిన డ్రైవర్లు బాబు, అమర్నాథ్ లు కూడా ఉన్నారు.క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై బాషా తెలిపారు.