• Neti Charithra

Breaking... చిత్తూరు నుంచి వెళుతున్న లారీ లో మంటలు.. 25 ద్విచక్ర వాహనాలు దగ్ధం..!


Breaking... చిత్తూరు నుంచి వెళుతున్న లారీ లో మంటలు.. 25 ద్విచక్ర వాహనాలు దగ్ధం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


తూర్పుగోదావరి జిల్లా సమీపం లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి కాకినాడకు ద్విచక్ర వాహనాలతో వస్తున్న కంటైనర్‌ ఆదివారం రాత్రి 12గంటలకు ఇంద్రపాలెం ప్రధాన రహదారిపై ప్రమాదానికి గురైంది. 11కేవీ విద్యుత్తు తీగలు వాహన పైభాగానికి తాకడంతో లోపల ఉన్న ద్విచక్ర వాహనాలకు మంటలు లేచాయి.

జగన్నాథపురం వెళ్లాల్సిన వాహనాన్ని డ్రైవర్‌ పొరపాటున ఇంద్రపాలెం వైపు

తీసుకెళ్లాడు. పొరపాటును గమనించి లారీని వెనక్కి మళ్లిస్తుండగా మంటలు రేగాయి. అప్రమత్తమైన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్‌ వాహనాన్ని నిలిపేసి కిందకు దూకేశాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కంటైనర్‌లో ఉన్న 25 వాహనాలు దగ్ధమైనట్లు ప్రాథమికంగా గుర్తించామని అగ్నిమాపక అధికారి బాబు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

278 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon