• Neti Charithra

Breaking.. చిత్తూరు తో పాటు 12 జిల్లాల్లో పోలింగ్ కుభారీగా క్యూ కడుతున్న ఓటర్లు..!


Breaking.. చిత్తూరు తో పాటు 12 జిల్లాల్లో పోలింగ్ కుభారీగా క్యూ కడుతున్న ఓటర్లు..!



అమరావతి: నేటి చరిత్ర


భారీ పోలీస్ భద్రత మధ్య ఏపీ లో పంచాయతీ ఎన్నికల తోలి దశ పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభం అయింది. రాష్ట్రం లోని విజయనగరం మినహా చిత్తూరు తో పాటు12 జిల్లాల్లో 2,723 పంచాయితీ లకు, 20,157 వార్డు లకు పోలింగ్


జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు తో పాటే, ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన 3,249 గ్రామ పంచాయితీ లకు గానూ 525 చోట్ల ఏక గ్రీవాలు అయ్యాయి. ముందుగా గుంటూరు మరియు చిత్తూరు జిల్లాలలో భారీగా ఏక గ్రీవాలు జరగగా వాటిని నిలిపివేశారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే సోమవారం సాయంత్రం ఏక గ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్నికల కమిషనర్.

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం తో కరోనా వైరస్ సోకిన వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. కరోనా సోకిన వారు మైదాన ప్రాంతాల్లో 2:30 నుండి 3 గంటల వరకు ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 12:30 గంటల నుండి 1:30 గంటల వరకు ఓటు వేసే లా చర్యలు తీసుకున్నారు. అయితే సాధారణ ఓటర్ల కి థర్మల్ స్కానింగ్ చేసి ఉష్ణోగ్రత అధికంగా ఉన్న వారిని వెనక్కి పంపి చివరి గంటల్లో అవకాశం ఇవ్వనున్నారు.అధికారులు సైతం కరోనా వైరస్ నియమ నిబంధనలు పాటించనున్నారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్