• Neti Charithra

Breaking.. చిత్తూరు తో పాటు రెండు జిల్లాల ఏకగ్రీవాలకు బ్రేక్ వేసిన ఎన్నికల సంఘం..!


Breaking.. చిత్తూరు తో పాటు రెండు జిల్లాల ఏకగ్రీవాలకు బ్రేక్ వేసిన ఎన్నికల సంఘం..!




అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ల సందర్భంగా రెండు జిల్లాల్లో అధికంగా జరిగిన ఏక గ్రీవాలకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అధికంగా జరిగిన ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చర్యలకు ఉపక్రమించింది. ఆయా జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలపై చిత్తూరు, గుంటూరు కలెక్టర్లను ఎస్‌ఈసీ వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించింది.ఎన్నికల సంఘం అనుమతిచ్చే వరకు ఏకగ్రీవాల

ప్రకటనలను నిలిపివేయాలని ఎస్‌ఈసీ

శుక్రవారం తాజా గా అధికారులకు

ఆదేశాలు జారీ చేసింది. నివేదికలు పరిశీలించాకే కమిషనర్‌ తదుపరి చర్యలుంటాయని స్పష్టం చేసింది. వైఫల్యాలుంటే చర్యలు తీసుకోవాలని కమిషన్‌ నిర్ణయించింది. దింతో ఏపీలో సర్పంచ్ ఎన్నికల ఏకగ్రీవాలు మరో సారి రాజకీయ ప్రకంపనలు స్టూష్టిస్తున్నాయి.