- Neti Charithra
Breaking.. చిత్తూరు జిల్లా సరిహద్దు లో తుపాకి కాల్పులు..ప్రముఖ పార్టీ నేతకు తప్పిన ప్రాణాపాయం..!
Breaking.. చిత్తూరు జిల్లా సరిహద్దు లో తుపాకి కాల్పులు..ప్రముఖ పార్టీ నేతకు తప్పిన ప్రాణాపాయం..!
చిత్తూరు: నేటి చరిత్ర
ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు లో ఓ పార్టీ నేతపై శనివారం జరిగిన కాల్పులు చిత్తూరు జిల్లాలో కల కులం రేపాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడుకు చెందిన నారాయణపురంలో డీఎంకే నేత వేలాయుధంపై కొందరు గుర్తు తెలియని దుండగులు నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. నాటు
తుపాకీ గుళ్ళు జేబులోని సెల్ ఫోన్కు తగలడంతో సెల్ ఫోన్ లోకి బుల్లెట్ దూసుకెళ్లి వ్యక్తి కి స్వల్పగాయలు తో బయట పడ్డాడు. అదృష్టవశాత్తు
ఆయనకు ప్రాణాపాయం తప్పింది. అప్రమత్తమైన స్థానికులు ఆయన్ను
హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. కాల్పుల తర్వాత నిందితులు కుప్పం వైపు పరారైనట్లు సమాచారం రావడం తో తమిళనాడు పోలీసులు చిత్తూరు జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టారు.