• Neti Charithra

Breaking..చిత్తూరు జిల్లాలో 29 కేంద్రాలద్వారా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి చర్యలు- డిఎంహెచ్ఓ పెంచలయ్య


Breaking..చిత్తూరు జిల్లాలో

29 కేంద్రాల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కి చర్యలు- డిఎంహెచ్ ఓ పెంచలయ్య!



సోమల: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలను చిత్తూరు డిఎంహెచ్ ఓ పెంచలయ్య గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగాసోమల కోవిడ్ సెషన్ సైట్ ను

ఆయన మదనపల్లె డివిజన్ డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్ మరియు పుంగనూరు నియోజకవర్గ వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లతో కలసి తనిఖీ చేశారు. ఈనెల 16 వ తేదీ మొదటి దశలో ఆరోగ్య సంరక్షకులకు కోవేశిల్డ్ వ్యాక్సిన్ పంపిణీ

నేపద్యంలో పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సోమల మరియు చౌడేపల్లి సెషన్ సైట్స్ ను ఎంపిక చేశామని వాటిలో ఈరోజు సోమల పాయింట్ ను పరిశీలించారు. మొత్తం జిల్లాలో 29 పాయింట్స్ గుర్తించామని తెలిపారు.16వ తేదీన ఎంపిక చేయబడిన కేంద్రాలలో ఉదయం 9.00 గం లకు స్థానిక ప్రజాప్రతినిధులు చే వ్యాక్సిన్ కార్యాక్రమం ప్రారంభించడం జరుగుతుంది అన్నారు.ప్రతీ సెషన్ సైట్ లో 5 మంది వ్యాక్సినేషన్ అధికారులు ఉంటారు.వేచిఉండు

గది,రిజిస్ట్రేషన్ గది,టీకా వేయు గది,పరిశీలన గది ఉంటాయని తెలిపారు.16వ తేదీ టీకా తీసుకున్న వారు రెండవ మోతాదు 28 రోజుల తర్వాత తీసుకోవాలని సూచించారు. ఈవిధంగా సమాచారం లబ్ధిదారులకు ఫోన్ లో పంపడం జరుగుతుంది అన్నారు.సోమల లో వ్యాక్సిన్ ను పరిశీలించారు. ఈకార్యక్రమంలో సోమల వైద్యాధికారి డాక్టర్ మానస ,హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ,సి.హెచ్.ఓ.రవిచంద్రన్ సిబ్బంది పాల్గొన్నారు

257 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon