• Neti Charithra

Breaking.. చిత్తూరుజిల్లా లో 24 గంటల్లో రేషన్ కార్డులు పంపిణీ చేసిన అధికారులు..!


Breaking.. చిత్తూరుజిల్లా లో 24 గంటల్లో రేషన్ కార్డులు పంపిణీ చేసిన అధికారులు..!




తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో కొత్త రేషన్ కార్థులు

కోసం దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అశోక్ నగర్ వాస్తవ్యులు తుపాకుల శిరీష, నిన్ను అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రేషన్ కార్డు మంజూరు కొరకు 33/2 వార్డు సచివాలయం, మధురానగర్ నందు దరఖాస్తు చేసుకున్న శిరీష కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కమిషనర్ గిరీష చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డు శిరీష కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులను, వార్డు సచివాలయ సిబ్బందిని, వి ఆర్ వో ను మరియు వార్డు వాలంటీర్లు ను అభినందించారు, గత సంవత్సరం వార్డు వాలంటీర్ గా మరియు వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చిన

ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించి, వార్డు సచివాలయం ద్వారా వివిధ పథకాలు, సేవలందిస్తున్న శుభ పరిణామమని, గతంలో రేషన్ కార్డు కోసం, కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది అని, నేడు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి గంటలో రేషన్ కార్డు ఇవ్వడం చాలా శుభ పరిణామమని తెలియజేశారు.

రేషన్ కార్డు పొందిన మహిళ తుపాకుల శిరీష మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు రేషన్ కార్డు కోసం, దరఖాస్తు చేసుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే అని, నిన్న దరఖాస్తు చేసుకోగా నేడు ఉదయం ఫోన్ ద్వారా, రేషన్ కార్డు మంజూరు అయిందని తెలియజేశారు, కమిషనర్ గిరీష గారికి, వార్డు అడ్మిన్స్ సెక్రెటరీ, వి ఆర్ ఓ లకు

ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ గిరీష వారితో పాటు సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, రెవెన్యూ ఆఫీసర్ 2 గాలి సుధాకర్, మధురానగర్ సచివాలయ సిబ్బంది, అడ్మిన్ సెక్రెటరీ సింధు భార్గవి, విఆర్వో రామ్మూర్తి, వార్డు వాలెంటర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.




Giri

APRO

MCT