• Neti Charithra

Breaking... చిత్తూరు జిల్లాలో 10 వేలు మంది పై బైండవర్ కేసులు- ఎస్పీ సెంథిల్ కుమార్..!


Breaking... చిత్తూరు జిల్లాలో 10 వేలు మంది పై బైండవర్ కేసులు- ఎస్పీ సెంథిల్ కుమార్..!చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో 4 వ విడత పంచాయతీ

ఎన్నికలు ప్రశాంతంగా జరిపెందుకు అవసరం అయిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన చిత్తూరు లో మీడియాతో మాట్లాడుతూ

ప్రణాళికా బద్దంగా, పటిష్టంగా బందోబస్తును నిర్వహించి 3 దశలలో గ్రామ పంచాయితీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించా మని

4 వ దశ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు - జిల్లా ఎస్పి శ్రీ ఎస్. సెంధిల్ కుమార్

తెలిపారు.ఎన్నికల నిర్వహణకు ఆటంకం కల్గిస్తే కఠిన చర్యలు, అత్యంత

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి, సి.సి కెమేరాలు, బాడీ వార్న్ కెమేరాల నిఘా నీడలో పోలింగ్ స్టేషన్లు, పరిసర ప్రాంతాలు ఉంచుతున్నామన్నారు.

చిత్తూరు జిల్లాలో నిర్వహించిన మొదటి దశ, రెండవ దశ మరియు మూడవ గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్ కుమార్ పేర్కొన్నారు.

ఈ నెల 9 వ తేదిన జరిగిన తొలిదశ ఎన్నికల నుంచి 17 వ తేదిన ముగిసిన మూడవ దశ ఎన్నికల వరకు ఎన్నికల కార్యాచరణకు అవసరమైన బందోబస్తును పోలీసు యంత్రాంగం పకడ్భందీగా నిర్వహించిందని, ఎన్నికలకు కేటాయించిన ప్రాంతాలు, గ్రామాలకు పోలీసు బందోబస్తును పటిష్టంగా నిర్వహించి ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా స్వేచ్ఛాయుత పరిస్థితులు కల్పించామని తెలిపారు. జిల్లాలో ఉన్న అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించి అడిషనల్ ఎస్పీలు, డిఎస్పి లు సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో ఎన్నికల పట్ల మనోధైర్యాన్ని కలిగించారని, ప్రతి రోజు ఎస్సై స్థాయి అధికారి తమ పరిధిలోని గ్రామాల యందు ప్రజలతో మమేకమై స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు భరోసా కలిగించారని, గతంలో ఎన్నడు లేని విధంగా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అల్లర్లు, గొడవలకు ఆస్కారం లేకుండా ముందస్తు గానే పటిష్టమైన కార్యాచరణాలు రూపొందించి అమలు పరచామని, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయ పరచి ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించడానికి మార్గం సుగమనం చేశామని, అత్యంత సమస్యాత్మక గ్రామాలలో ప్రజల సహకారంతో పటిష్టమైన ఇంటలిజెన్స్ నెట్వర్క్ ను ఏర్పరచి సిసి కెమెరాలను కూడా అమర్చి ఎలాంటి శాంతి భద్రత సమస్యలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని, తద్వారా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 3 దశలలో ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ గారు తెలిపారు.

బందోబస్తూ వివరములు వివరిస్తూ చిత్తూరు, పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలో 6 మండలాలలో 673 వార్డులలో 218 పోలింగ్ లొకేషన్లు ఉండగా వీటిలో 58 హైపర్ సెన్సిటివ్ లొకేషన్లు, 78 సెన్సిటివ్ లొకేషన్లు, 74 నార్మల్ లొకేషన్లు ఉన్నాయని, వీటన్నింటిలోను గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశామని 1879 మంది పోలీసులచే గట్టి బందోబస్తు నిర్వహించామని, 20 రూట్ మొబైల్ పార్టిలు, 42 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు లను ఏర్పాటు చేశామని తెల్పుతూ బ్యాడ్ క్యారక్టర్ కల్గిన సుమారు 10,000 మందిని ముందు జాగ్రత్త చర్యగా బైండ్ ఓవర్ కూడా చేశామని తెలిపారు. ప్రజలు కూడా తమ వంతు భాద్యతగా ఎన్నికల వేల ఏవైనా అవంచనీయ సంఘటనలు జరిగిన వెంటనే డయల్ 100 గాని పోలీసు whatsapp నెంబర్ 9440900005 కు తెలపవలసినది గా సూచించారు.

339 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon