- Neti Charithra
Breaking.. చిత్తూరు జిల్లా లో స్వామీజీ దారుణ హత్య..నిందితుల కోసం..జా గిలాలు రాక. !
Breaking.. చిత్తూరు జిల్లా లో స్వామీజీ దారుణ హత్య..నిందితుల కోసం..జా
గిలాలు రాక. !
చిత్తూరు: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లాలో ఓ స్వామిజీ దారుణహత్యకు గురవడం కల కలం రేపింది. ఐరాల మండలం గుండ్లపల్లె సమీపంలోని శ్రీరామతీర్థ సేవాశ్రమంలో అచ్యుతానందగిరి స్వామిని గుర్తు తెలియని దుండగులు దారుణ హత్యకు పాల్పడ్డారు. డిఎస్పీ సుధాకర్ రెడ్డి కథనం మేరకు.. శ్రీరామతీర్థ సేవాశ్రమ బాధ్యతలను అచ్యుతానందగిరి స్వామి పర్యవేక్షిస్తున్నారు. లక్ష్మమ్మ అనే వృద్ధురాలైన సహాయకురాలితో కలిసి ఆశ్రమంలో ఇద్దరే ఉంటున్నారు. మంగళవారం రాత్రి
ఆగంతకులు ఆశ్రమంలోకి చొరబడి
(ఐరాల లో హత్యకు గురైన స్వామీజీ)
అచ్యుతానందగిరి స్వామిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ చప్పుడు విని అక్కడకు వచ్చిన లక్ష్మమ్మ భయంతో పారిపోయి మామిడి తోటలో దాక్కుని రాత్రంతా అక్కడే ఉండిపోయింది. బుధవారం ఉదయం చూసేసరికి అచ్యుతానందగిరి స్వామి హత్యకు గురైనట్లు గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్ బృందం పరిశీలించింది.