• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లాలో విషాదం.. 4 మాసాల క్రితం..పెళ్లి..మహిళా పోలీస్ తోపాటు భర్త ఆత్మహత్య..!


Breaking.. చిత్తూరు జిల్లాలో విషాదం.. 4

మాసాల క్రితం..పెళ్లి..మహిళా పోలీస్ తోపాటు భర్త ఆత్మహత్య..!
చిత్తూరు: నేటి చరిత్ర


ఓ మహిళా పోలీస్ తో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగి భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడటం చిత్తూరు జిల్లాలో

కలకలం రేపుతోంది. స్థానిక పోలీసుల కథనం మేరకు..పాకాల భారతమిట్ట లోని ప్రాంతానికి చెందిన సమియా(30), అల్తాఫ్ హుస్సేన్‌(32) లు నాలుగు మాసాల క్రితం వివాహం చేసుకున్నారు.

మండలంలోని కె.వడ్డేపల్లి గ్రామ సచివాలయంలో సమియా మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. అల్తాఫ్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.

సమియా గురువారం విధులకు హాజరు కాలేదు. గైర్హాజరుకు సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తోటి ఉద్యోగులు మహిళా పోలీసు ఇంటికి వెళ్లి చూడగా.. భార్యభర్తలిద్దరూ బాత్‌రూమ్‌లో మృతి చెందిన బిస్జయం గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు

ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం

ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు