• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో విషాదం.. నీటి కుంటలో పడి ఇద్దరు మృతి..!


Breaking.. చిత్తూరు జిల్లా లో విషాదం.. నీటి కుంటలో పడి ఇద్దరు మృతి..!చిత్తూరు : నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది.. పశుల మేతకు వెళ్లి.. దాహం తీర్చుకునే

ప్రయత్నం లో ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.కంభంవారిపల్లె మండలం వగళ్లకు చెందిన కొన్ని కుటుంబాలు ఎనిమిదేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం పీలేరు మండలం ఠాణావడ్డిపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. వీరిలో ప్రసాద్‌ భార్య

కొండమ్మ(28), రెడ్డెప్ప కుమారుడు రెడ్డిశేఖర్‌(13) పశువులను మేపడానికి సోమవారం అటవీ ప్రాంతానికి వెళ్లారు. తాగునీటి కోసం తొలుత రెడ్డిశేఖర్‌ సమీపంలోని బావిలోకి దిగి ప్రమాదవశాత్తు పడిపోయాడు. అతన్ని కాపాడడానికి బావిలోని దిగిన కొండమ్మను బాలుడు గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. చీకటి పడుతున్నా వీరు ఇంటికి రాలేదు. బంధువులు అటవీ ప్రాంతంలో గాలించినా ఫలితం లేకపోయింది. అడవిలో ఉన్న బావి వద్దకు వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. రెడ్డిశేఖర్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొండమ్మకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు పీలేరు పోలీసులు తెలిపారు.

502 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon