• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో రైతులు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు పడ్డ మరో రెవిన్యూ ఉద్యోగి.


Breaking.. చిత్తూరు జిల్లా లో రైతులు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు పడ్డ మరో రెవిన్యూ ఉద్యోగి..!



రైతునుంచి లంచం డిమాండ్ చేస్తూ.. చిత్తూరు జిల్లాలో మరో రెవిన్యూ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టు పడి కట కటాల పాలయ్యాడు. నెల రోజుల క్రితం మదనపల్లె లో భారీగా లంచం డిమాండ్ చేసి ఓ రెవిన్యూ ఉద్యోగి ఏసీబీకి పట్టుపడగా తాజాగా జిల్లాల్లో

మరో ఉద్యోగి.. ఏసీబీకి చిక్కడం కల కలం రేపుతోంది...ఏసీబీ డీఎస్పీ అల్లాబక్ష్‌ కథనం

మేరకు.. తండ్రి మృతిచెందడంతో ఆయన పేరిట ఉన్న భూమిని తమ పేరు మీదకు మార్చాలని వీఆర్వో నాగరాజునాయుడును

బంగారుపల్యం మండలంలోని బోడబండ్లకు చెందిన దేవరాజులు, వెంకటాద్రి, గోవింద్‌, సుబ్రమణ్యం కోరారు. వీఆర్వో ఒక్కొక్కరి



(ఏసీబీ కి పట్టుపడ్డ రెవిన్యూ ఉద్యోగి నాగ రాజు నాయుడు)


నుంచి రూ.8 వేలు డిమాండ్‌ చేశారు. దేవరాజులు అంత ఇవ్వలేనని చెప్పడంతో రూ.5 వేలు అయినా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. బాధితరైతు కుమారుడు వెంకటేశులు గతనెల 29న రూ.2 వేలు ఇచ్చాడు. మిగతా సొమ్ము ఇస్తేనే పనిచేస్తానని చెప్పడంతో వెంకటేశులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. డీఎస్పీ లు అల్లాబక్ష్‌, జనార్ధన్‌నాయుడు, సీఐలు తమ్మిమహమద్‌, నాగేంద్ర ల ఆధ్వర్యంలో దాడులు చేయగా

వీఆర్వోకు రైతు కుమారుడు నగదు ఇస్తుండగా పట్టుకున్నారు. తహసీల్దారు కార్యాలయంలో విచారించి.. అరెస్టు చేసి నెల్లూరు లోని ఏసీబీ కోర్టు తరలించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్