- Neti Charithra
Breaking.. చిత్తూరు జిల్లా లో పోలీస్ స్టేషన్ పై దాడి.. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు..!
Breaking.. చిత్తూరు జిల్లా లో పోలీస్ స్టేషన్ పై దాడి.. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు..!
వెదురుకుప్పం: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ పై స్థానికులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి యనమల మంద ఎస్సి కాలని లో బాల్య వివాహం జరుగుతోందని గుర్తు తెలియని వ్యక్తులు
సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వివాహ తంతుకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. అక్కడ వాగ్వివాదం చోటు చేసుకోగ కొందరు వ్యక్తులు ఓ పోలీసు పై చేయి చేసుకున్నారు. దింతో పోలీసులు లాఠీలకు పనిచెప్పినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన లో పలువురికి గాయాలయ్యాయి.
పోలీసులు సిబ్బంది పై దాడులు చేసిన వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో పలువురు
స్టేషన్ పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.అనంతరం స్టేషన్ ఎదుట నిరసనకు దిగి పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని వదిలి పెట్టాలని సుమారు 100 మంది ఆందోళనకు దిగటం తో పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు.