• Neti Charithra

Breaking.. చిత్తూరుజిల్లా లో ప్రేమ పేరుతో.. మోసగించి.. లక్షలు తో ఉడా యించిన మాయ గాడు..అరెస్ట్..!


Breaking.. చిత్తూరుజిల్లా లో

ప్రేమ పేరుతో.. మోసగించి.. లక్షలు తో ఉడా యించిన మాయ గాడు..అరెస్ట్..!





తిరుపతి: నేటి చరిత్ర



మాయమాటలు.. చెప్పి .

ప్రేమ పేరుతో.. యువతుల వద్ద లక్షలు కాజేసిన మాయగాన్ని చిత్తూరుజిల్లా చంద్రగిరి సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి.


ఎస్.ఐ రాజశేఖర్ కథనం మేరకు..

పాకాల మండలం మొగరాల పంచాయతీ గొల్లపల్లికి చెందిన చిన్నస్వామి కుమారుడు గుణశేఖర్ అలియాస్ విక్రమ్ సిద్ధార్థ్ చౌదరి గా పేరు మార్చుకుని అమ్మాయిలను మోసగించడం లో ఆరితీరాడని, ప్రభుత్వం అనుమతి లేకుండా రెండు నాటు తుపాకులను పెట్టుకుని అడవి జంతువులను వేటాడి వాటిని

అమ్ముకుంటున్న నందున అతనిపై భారత ఆయుధ చట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అలాగే పాకాల కు చెందిన గాయత్రి అనే అమ్మాయి విక్రమ్ సిద్ధార్థ చౌదరి తో చాటింగ్ ద్వారా ప్రేమించే ఎలా చేసుకుని తన వద్ద నుండి 10 లక్షల రూపాయల వరకు డబ్బులు ఆన్లైన్, ఏటీఎం కార్డు, పేటీఎం ద్వారా వసూలు చేసుకొని మోసగించాడని పాకాల ఎస్.ఐ రాజశేఖర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు.

పోలీసు విచారణలో మొగరాల పంచాయతీ గొల్లపల్లికి చెందిన గుణశేఖర్ విక్రమ్ సిద్ధార్థ్ చౌదరి గా పేరు మార్చుకుని అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కల్లుకుంట గ్రామం కు చెందిన వ్యక్తిని అని,నేను బీటెక్ చదివానని హైదరాబాద్ గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేస్తానని అమ్మాయిలను చాటింగ్ ద్వారా మోసగించి వారి నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు నిర్ధారణ అయిందని చెప్పారు.

ఈనెల 20వ తేదీ మంగళవారం

ఉదయం 11గంటలకు పాకాల మండలం మొగరాల పంచాయతీ జంగాల పల్లి గ్రామ సమీపం నందుగల క్రిష్ణాపురం క్రాస్ వద్ద అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుండి ఐదు లక్షల రూపాయలు డబ్బు, ద్విచక్ర వాహనం రాయల్ మోటార్ సైకిల్, ఒక బంగారు నల్లపూసల దండ ,ఒక జత కమ్మలు, చంపసవరాలు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్, రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకుని ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని చెప్పారు. వీరిని అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బంది ముక్తి, శివ లకు రివార్డు అందజేసి అభినందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సోమశేఖర్, బాబు, సురేఖ, భారతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


434 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon