• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో టాస్క్ ఫోర్స్ దాడులు.. భారీగా ఎర్రచందనం పట్టివేత..!



Breaking.. చిత్తూరు జిల్లా లో టాస్క్ ఫోర్స్ దాడులు.. భారీగా ఎర్రచందనం పట్టివేత..!





తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలో శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ చేపట్టిన కూంబింగ్ లో 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు కు అందిన సమాచారం మేరకు ఆర్ ఎస్ ఐ లింగాధర్ టీమ్

శుక్రవారం ఉదయం కూంబింగ్ చేపట్టినట్లు డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. భాకరాపేట నుంచి తల కోన ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారని చెప్పారు. కటిక కనుమ వద్ద నుంచి నాచి నరేడు పెంట సమీపంలోని దట్టమైన అడవుల్లో కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసు కుని వస్తూ కనిపించారని తెలిపారు. అయితే స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ బృందాన్ని గమనించి, అరుస్తూ దుంగలను పడేసి పారిపోయారు. వారిని

వెతుక్కుంటూ కొంతమంది టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంబడించారు. ఆ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలు లభించాయని డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. సంఘటన స్థలానికి సిఐ సుబ్రహ్మణ్యం చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


84 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon