• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో టీడీపీ మద్దతు అభ్యర్థి "కిడ్నాప్ " లో కీలక మలుపు..!


Breaking.. చిత్తూరు జిల్లా లో టీడీపీ మద్దతు అభ్యర్థి "కిడ్నాప్ " లో కీలక మలుపు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం లో సంచలనం కలిగించినకిడ్నాప్ కు గురైన సామకోటవారిపల్లి సర్పంచ్ టీడీపీ మద్దతు అభ్యర్థి ఓబుల్ రెడ్డి ని ఎట్టకేలకు ఇంటికి చేరారు. జిల్లాలో కల కలం రేపిన ఈ ఘటన లో చివరకు కిడ్నాపర్ లు ఓబుల్ రెడ్డి ని విడిచి పెట్టడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి.సామకోటవారిపల్లె సర్పంచి పదవికి టీడీపీ మద్దతుతో ఓబులురెడ్డి పోటీకి సిద్ధమ.య్యారు. గురువారం

ఉదయం నామినేషన్‌ వేయడానికి బుధవారం రాత్రి వరకు ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు ఇంటింటి ప్రచారం చేపట్టారు. గురువారం తెల్లవారు జామున 3.30 గంటలకు పోలీసుల పేరిట ఇంటి తలుపు తట్టగా ద్వారం తెరిచారు. అనంతరం నలుగురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని ముసుగు ధరించి తీసుకెళ్లారు. పగలంతా కారులో తిప్పారు. కనీసం మంచి నీరు కూడా ఇవ్వలేదు. అపహరించిన వ్యక్తులు గుర్తుపట్టని విధంగా వ్యవహరించారని వివరించారు.